TG: BRS అధినేత KCR దూరదృష్టితో ఆలోచిస్తారని MLC కవిత వెల్లడించారు. ‘నాకన్నా మా ఆయన అంటేనే నాన్న(KCR)కు చాలా ఇష్టం. నన్ను అరెస్ట్ చేస్తారని KCR జనవరిలోనే పిలిచి చెప్పారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. పదవికి రాజీనామా చేయాలా? అని నేను అడిగా. అవసరం లేదన్నారు. నా తప్పేమీ లేదని, లీగల్‌గా ఫైట్ చేద్దామని నాన్న చెప్పారు. జైల్లో చాలా బాధ అనుభవించా. పగవాళ్లకు కూడా ఆ పరిస్థితి రాకూడదు’ అని కవిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Post Views: 94








