రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శాస్త గార్డెన్ లో నిర్వహించిన, ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్బూల్లాపూర్ మెట్టు మండలాలోని మహిళా సంఘాలకు వడ్డీ లేని 3కోట్ల 98 లక్షల రూపాయల రుణాలు, ప్రమాదంలో మరణించిన ఇద్దరు మహిళల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కులను, రంగారెడ్డి జిల్లా డిఆర్డిఓ పిడి శ్రీలతతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత ప్రభుత్వాలు పేదల, మహిళల అభివృద్ధికి ఏనాడు పట్టించుకోక మహిళల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలోని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేయడం జరిగిందని అన్నారు. మహిళలు స్వయం శక్తితో ఎదగాలని, స్వయం సంపాదనతో పురుషులకు దీటుగా సంపాదించాలని ఆయన మహిళలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో, వసతి గృహాలలో, గురుకులాలో చదివే విద్యార్థులకు యూనిఫారంలను మహిళా సంఘాల ద్వారా కుట్టించి, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 45000 ఇందిరమ్మ ఇండ్లు, నిరుపేద మహిళలను యజమానులను చేస్తూ, వారి పేరు మీద పంపిణీ చేసిందన్నారు. బిఆర్ఎన్ విధి విధానాల వల్ల రాష్ట్రం అప్పుల పాలు అయిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంటే, ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఉచిత కరెంటు, ఐదు వందలకే వంట గ్యాస్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, నిరుపేదలకు నన్న బియ్యం పంపిణీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ, రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా అందించడం జరిగిందని వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం మహిళలకే ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి మహిళా సంఘాల మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఈసీ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అమృత సాగర్, జయమ్మ, రాచర్ల వెంకటేశ్వర్లు, మంకాల దాసు, ముత్యాల రాజశేఖర్ రావు, ఏఎంసి వైస్ చైర్మన్ మంకాల కర్ణాకర్, ఏఎంసి డైరెక్టర్ శ్రీశైలం (రామారావు), శ్రీనివాస్ రెడ్డి, పలు శాఖల అధికారులు, మహిళలు, ఏపిఎంలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.








