వరంగల్ మహా;
డివిజన్ లోని తోట పోచమ్మ దేవాలయం అభివృద్ధికి తాను శాయశక్తుల కృషి చేస్తానని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి తెలిపారు. ఈ సందర్భంగా మరుపల్ల రవి మాట్లాడుతూ కార్యవర్గంలో దైవ భక్తి కలిగిన వారు దేవాలయం అభివృద్ధికి పాటుపడే వ్యక్తులను కార్యవర్గంలో కొనసాగాలని ఆయన కోరారు. శ్రావణ మాసంలో నిర్వహించనున్న పోచమ్మ బోనాల సందర్భంగా దేవాలయానికి కార్పొరేషన్ నుండి రంగులు వేయించడం అలాగే దేవాలయం ముందు రోడ్డు ఎగుడు దిగుడు ఉన్నదాన్ని సమాంతరంగా చేయడానికి మొరంతో చదును చేసి పారిశుద్ధ్య పనులను చేయిస్తానని ఆయన తెలిపారు. 40 డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి సమక్షం లో తోట పోచమ్మ దేవాలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Post Views: 47








