తలమడుగు మహా న్యూస్:
టైగర్ కారిడార్ పేరుతో ఆదివాసీలను అడవి నుంచి దూరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నారని తుడుం దెబ్బ జిల్లా డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమ్ర జ్ఞానేశ్వర్ అన్నారు. మండలంలోని సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై ఆదివాసి నాయకులు బైఠాయించి జీవో నెంబర్ 49 ను ఉపసంహరించుకోవాలని తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ ను విజయవంతం చేయడం జరిగింది. కుమ్ర జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 49 ఆదివాసీలకే కాకుండా జిల్లాలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరగబోతుందని అటవీ శాఖ అధికారుల చేతుల్లో కీలుబొమ్మల మారడం తప్ప వేరే ఉద్దేశం లేదని వాపోయారు.త్వరలో ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తుడుం దెబ్బ అధ్యక్షులు జంగాల పోచ్చన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ భుజంగరావు, మండల యువజన అధ్యక్షుడు నరేందర్ ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.








