Mahaa Daily Exclusive

  అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ మల్లెపూల నర్సయ్య..!

Share

ఆదిలాబాద్, మహా

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సరైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచేలా తగు చర్యలు తీసుకుంటామని గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తెలిపారు. గ్రంధాలయ సంస్థ చైర్మెన్ గా నియామకమైన ఆయన లైబ్రెరియన్ సతీష్ చేతుల మీదుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి అడే గజేందర్, టీఎన్జీఓస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, నవీన్ తో పాటు పలువురు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శాలువతో సత్కరించారు. పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు పాఠకులకు లైబ్రరీలో సౌకర్యాలు కల్పించేల కృషి చేస్తానని గ్రంధాలయ సంస్థ చైర్మెన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ పనుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేస్తామన్నారు. తనకు పదవి రావడానికి సహకరించిన మంత్రులతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు, అభిమానులకు ధన్యవాదలు తెలిపారు.

Latest