మంచిర్యాల, మహా : భద్రత, స్వీయ రక్షణతో విధులు నిర్వహించాలని మందమర్రి ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ విజయ్ ప్రసాద్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ రఘుకుమార్ లు సూచించారు.
సోమవారం ఎస్.డి.టి.సి. (స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్) లో ఈ.పి ఆపరేటర్స్, ఎం.వి డ్రైవర్లకు రెండు రోజుల సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ.పి ఆపరేటర్స్, ఎం.వి డ్రైవర్స్ భద్రత ప్రమాణాలు పాటిస్తూ, స్వీయ రక్షణతో, జాగ్రత్తగా పని చేయాలని అన్నారు. గనులలో ప్రమాదాల నివారణకు సి.ఎం.ఆర్ 2017 లో నిర్దేశించిన రెగ్యులేషన్ ప్రకారం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలుపరచడం, ఎస్.ఎం.పి పాటించాలని, ఏమైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత సూపర్వైజర్లు, అధికారులకు తెలియజేసి భద్రత చర్యలు చేపట్టి ప్రమాదాలు నివారించాలని అన్నారు. ఈపీ ఆపరేటర్స్, ఎంవి డ్రైవర్స్ అన్ని రక్షణ చర్యలను పూర్తిగా అవగాహన చేసుకోని ప్రమాద రహిత సింగరేణిగా లక్ష్యాన్ని సాధించాలని వెల్లడించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడమే వారి వారి ద్వేయంగా విధులను నిర్వహించేలా అన్ని క్యాటగిరి ఉద్యోగులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూ శంకరయ్య, ఏ.ఐ.టీ.యూ.సీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, వృత్తి శిక్షణ కేంద్రం మేనేజర్ శంకర్, రక్షణాధికారి విజయ్ కుమార్, వృత్తి శిక్షకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.








