మందమర్రి, మహా : ఆగస్టు 7 నాడు గోవా రాష్ట్రంలో జరిగే జాతీయ ఓబీసీ 10వ మహా సభలను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్ లు
పిలుపునిచ్చారు. సోమవారం మందమర్రి పట్టణం బిఆర్ అంబేద్కర్ స్థూపం ముందర ఆ సంఘం గోడపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మేమెంతో మాకంత అనే నినాదంతో హక్కుల కోసం పోరాడి విజయాలు సాధించాలని అన్నారు. రానున్న కాలంలో పాలితులుగా ఉన్నవాళ్ళం కావాలని నినాదంతో ముందుకు కదరాలని వారు వివరించారు. బీసీ లందరూ అంతిమంగా రాజకీయ అధికారాన్ని సాధించి బీసీల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ నాయకులు తడిగొప్పుల రవిరాజా, జాడ క్రాంతి కుమార్, చెప్పాల రమేష్, క్వాజా ఖలీమోద్దీన్, యోగానంద రావు, సంపత్, కలీల్, ఎర్రన్న, యాదగిరి, రమేష్, యూత్ నాయకులు గరిగె సుమన్, ముష్కే అఖిల్, శ్రావణ్, అర్కటి రవీందర్, అనిల్, ఒమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.








