కారేపల్లి, మహా:డోర్నకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్ వైపు వెళ్తున్న ఖాళీ గూడ్స్ రైలు బోగీలు మధ్య లింక్ తెగిన ఘటన కారేపల్లి మండలం గేట్ కారేపల్లి ఎల్ సి నెం.4 గేట్ సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రైలు వ్యాగన్ల మధ్యలో ఉన్న లింక్ ఊడిపోవటంతో గేట్ మెన్ భుక్య శ్రీను గమనించాడు. వెంటనే లోకో పైలట్ కు గార్డ్ కు సమాచారం ఇవ్వటం తో రైలు ను ఆపారు. వెంటనే రైల్వే సిబ్బంది శ్రమించి గూడ్స్ బోగీల లింక్ ను కలపి మరమ్మతులు చెయ్యటం తో గూడ్స్ కదిలింది. దీంతో గేటు వద్ద గూడ్స్ రైలు గంట సేపు నిలిచిపోయింది.
Post Views: 63








