Mahaa Daily Exclusive

  మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆరోపణలు ఖండిస్తున్నాం –టీయూడబ్ల్యూజే యూనియన్ పై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు టియుడబ్ల్యూజే మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డేగ సత్యం..!

Share

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అసత్య ఆరోపణలను ఖండిస్తున్నామని మంచిర్యాల జిల్లా టి.యు.డబ్ల్యూ.జే (ఐ.జే.యు) అనుబంధం అధ్యక్షులు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి పింగళి సంపత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు ప్రకాష్ రెడ్డి లు వాక్యానించారు. శుక్రవారం ఆ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం మందమర్రి ఏరియా సింగరేణి సి ఈ ఆర్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కమిటీ మెజారిటీ సభ్యుల ప్రతిపాదనల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. కొంతమంది టియూడబ్ల్యూజే
యూనియన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం
చేస్తున్నారని అన్నారు. అలాంటి వాటిని మన యూనియన్ వివిధ మండలాలలో ఉన్న ప్రతినిధుల బృందం తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఇకనుండి మన యూనియన్ ను కానీ అలాగే మన నాయకత్వాన్ని కానీ ఎవరైనా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే వారికి వెంటనే రియాక్షన్ కౌంటర్ ఇవ్వాలని తీర్మానించినట్లు స్పష్టం చేశారు.
చాలామంది అనర్హులు పత్రికలకు పనిచేస్తున్నామని, యూట్యూబ్ ఛానల్ కు పని చేస్తున్నమని కొంతమంది వారి, వారి వివిధ వాహనాలపై ప్రెస్ స్టిక్కర్స్ అంటించుకుని అసలైన పాత్రికేయులకు అవమానాలు తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయంపై సిపి, డిసిపిల దృష్టికి తీసుకువెళ్లి అసలైన మీడియా ప్రతినిధులకు పోలీస్ ప్రెస్ స్టిక్కర్లు అందజేసే విధంగా చొరవ తీసుకుంటామని తెలిపారు. అనంతరం మందమర్రి ప్రెస్ క్లబ్ మిత్రబృందం విన్నపాలను విన్నారు. గతంలో మందమర్రి పట్టణానికి చెందిన బొడ్డు రవి వాల్మీకి మృతిచెందితే అతని కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారంతో పాటు తన భార్యకు మూడు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేపించిన ఘనత టి యు డబ్ల్యూ జే అని కొనియాడారు. వివిధ మండలాలలో ఏర్పడిన పాత్రికేయుల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని తక్షణమే పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఆ యూనియన్ కోశాధికారి వంశీ, ఉపాధ్యక్షులు సురేష్ చౌదరి, మద్దెల సంజీవ్, టి రవిరాజ్, చిలివేరి నర్సయ్య, కొండు శ్రీనివాస్, బిరుదుల దేవరాజ్, కలువల శ్రీనివాస్, ఆర్ రమేష్, దెబ్బటి తిరుపతి, ఉదయ్ కుమార్, సత్యం, శ్రీనివాస్, రాజేష్ ఉన్నారు.