ఆదిలాబాద్, మహా
వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించేలా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నియమాలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు చలాన్లు విధిస్తున్నారు. పట్టణంలోని తెలంగాణ తల్లి కూడలి, కలెక్టర్ చౌక్ తదితర ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ముఖ్యంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలను స్టేషన్ కు తరలించి అప్పటికపుడు నంబర్ ప్లేట్లు బిగించేలా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను సంబంధించిన సరైన ధ్రువపత్రాలు, ఇన్సురెన్సు లేకపోతే చలనాలు విధించడంతో పాటు వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు.
Post Views: 48







