AP: బాధితులకు సత్వర న్యాయం అందుతున్న రాష్ట్రాల్లో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. పోక్సో కేసులను ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. ప్రజా నమ్మకం, భద్రత, సంక్షేమాన్ని పెంపొందించే ఏకైక లక్ష్యంతో విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ పని చేస్తోందని హోం మంత్రి స్పష్టం చేశారు.
Post Views: 40








