Mahaa Daily Exclusive

  వచ్చే 4 గంటల్లో భారీ వర్షం: GHMC

Share

TG: హైదరాబాద్‌లో వచ్చే 4 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని GHMC నగర వాసులను అప్రమత్తం చేసింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నగర వాసులు ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం వరకు సాధారణ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.