Mahaa Daily Exclusive

  మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు..!

Share

మందమర్రి, మహా, ఆగస్టు 15 : మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దెల సంజీవ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాల పైగా ఆంగ్లేయులు నిరంకుశ పాలన సాగించారని అన్నారు. ఈ పాలనలో భారత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వివరించారు. ప్రజలపై పన్నులు, తిరుగుబాటు దారులకు ఉరిశిక్ష, స్త్రీల మానప్రాణాలకు రక్షణ లేదని చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో భారతదేశ విముక్తి కొరకు వేలాదిమంది భారత వీరులు ప్రాణ త్యాగాలు చేశారని వెల్లడించారు. ఈ పోరాటంలో రక్తాన్ని చిందించిన వీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ప్రస్తుత భారతదేశం 2020 విజన్ లో ముందుకు దూసుకుపోతుందని వివరించారు. రానున్న అతి కొద్ది కాలంలో భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా ఆర్థిక వృద్ధి ప్రగతిని సాధిస్తుందని స్పష్టం చేశారు. స్వతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ చలువవల్లనే 1947 లో స్వతంత్రం సిద్ధించిందని చెప్పారు. అంతకుముందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే అమరులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తాండ్ర శ్రీనివాస్, బొల్లం శివానందం, ఎండి ఖలీమోద్దీన్, కొంటూ సతీష్, సత్యనారాయణ, సతీష్, శివరామకృష్ణ, శ్రీనివాస్, నవీన్, గోలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.