జూలూరుపాడు, ఆగస్టు 24, (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామంలో ద్విచక్ర వాహనం, బొలెరో ట్రక్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు కి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంగన్నపాలెంలోని హరిత షాపింగ్ మాల్ సమీపంలో మండల పరిధి గంగారం తండా గ్రామానికి చెందిన ధారావత్ రాంబాబు ద్విచక్ర వాహనంపై వస్తుండగా బొలెరో వాహనం ఢీకొనడంతో రాంబాబుకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో పడి ఉండగా అతనిని 108 వాహనంలో స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 72







