ఆదిలాబాద్ మహా : ఎండోమెంట్ భూములు, భూ భారతిలో నమోదైన
సాదాబైనామాలు , అసైన్డ్ ల్యాండ్ దరఖాస్తుల పై గూగుల్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
విధ మండలాల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, భూ పరమైన వివాదాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భూ భారతి రెవెన్యు సదస్సులో వచ్చిన సాదాబైనామా, అసైన్డ్ లాండ్ కు సంబందించిన దరఖాస్తులు ఎన్ని, అందులో ఎన్ని నోటీసులు జనరేట్ చేసి సర్వే ప్రక్రియ పూర్తి చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ కి గల కారణాలను కలెక్టర్ ఆన్ని మండలాల తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.ఎక్కువ పెండింగ్ ఉన్న మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు .ఆర్డీవో లాగిన్ లో ఉన్న విరాసిత్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, పేరు, సర్ నేమ్ , తదితర పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని తెలిపారు. ప్రతి ఒక్క దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి, భూ రికార్డులను ప్రామాణికంగా రూపొందించాలని,అదేవిధంగా భూ భారతి అప్లికేషన్‌లో నమోదవుతున్న సాదా బైనామాలు, వాటి పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రోహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 11న జిల్లాకు రానున్న సందర్భంగా ఆన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు,
ముఖ్యంగా భోరజ్ మండలం పిప్పర్ వాడ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు .బోథ్, ఇంద్రవెల్లి, అదిలాబాద్ రూరల్ లో పలు కార్యక్రమాలను ప్రారంభించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రివ్యూ మీటింగ్ కి హాజరవుతారని , అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు.ఈ గూగుల్ మీట్ లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి ఆన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యు విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.






