Mahaa Daily Exclusive

  ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేయాలి..!

Share

ఆదిలాబాద్ : వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రతిపాధికన పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం మాధవరావు విజ్ఞాన కేంద్రంలో యూనియన్ జిల్లా 3వ మహాసభలను నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అథితిగా హాజరై పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ… వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంని పని చేస్తున్న వేతన సవరణ లేదన్నారు. జూలై 2023 నాటికి పీఆర్సీ గడువు ముగిసిందన్నారు. దాన్ని అమలు చేయని చేయని కారణంగా పర్మినేట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా నష్టపోతున్నారన్నారు. వైద్య ఆరోగ్యలో శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న వేతనాలతో పాటు సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం చొరువ చూపాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నవీన్, సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశన్న, కిరణ్, అగ్గిమల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest