Mahaa Daily Exclusive

  అశ్వాపురంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అధిక సంఖ్యలో పాల్గొన్న ముస్లింలు…!

Share

అశ్వాపురం: మహా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రం జామా మసీద్ లో ఆదివారం అబ్దుల్లా, అమీనా బి దంపతుల ఏకైక సంతానం మహమ్మద్ ప్రవక్త 1500వ జన్మదిన వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో మండలంలోని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం జామా మసీద్ నుండి అశ్వాపురం ప్రధాన రహదారి మీదుగా గౌతమి నగర్ కాలనీ గేట్ నుండి గొందిగూడెం రోడ్డు వరకు భారీగా మహమ్మద్ ప్రవక్త నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా జామా మసీద్ మత గురువు ప్రవక్త పుట్టిన రోజు, వారి జీవనశైలి, వారి మహిమలు, యావత్ ప్రజానీకానికి వారిచ్చిన సందేశాన్ని వివరిస్తూ… సద్ మార్గంలో నడవాలని, విరివిరిగా దానధర్మాలు చేయాలని, జకాత్, ఫిత్రా, ఐదు పూటల నమాజు చేయాలని, జీవితంలో ఒక్కసారి అయినా హజ్ యాత్రలో భాగంగా మక్కాను దర్శించాలని, పరమత సహనం పాటించాలని, అందరితో సోదర భావంతో మెలగాలని, శాంతి, అహింస మార్గంలో నడవాలని, వారు ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి అమలు చేయాలని, దానివల్ల సమస్త మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని సూచించారు. తరువాత మండలంలోని ముస్లిం సోదరులు, మహిళలు, పిల్లలు,పెద్దలు అందరికీ బోధనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో…మిలాద్ ఉన్ నబి కమిటీ సభ్యులు, జామా మసీద్ కమిటీ సభ్యులు,మత గురువులు, మత పెద్దలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest