Mahaa Daily Exclusive

  ఐదేళ్ల పోరాటానికి…విజయం…! నూతనంగా మత్స్య సోసైటీ ఏర్పాటు. 64 మంది కి సభ్యత్వం అందించిన ప్రభుత్వం…!

Share

నేలకొండపల్లి, సెప్టెంబర్ 14 మహా:

మండలం లోని అప్పలనరసింహాపురం మత్స్యపారిశ్రామిక సంఘం నూతనంగా ఏర్పాటు చేశారు. గ్రామంలోని చెరువు కు సోసైటీ ఏర్పాటు చేసి మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని గత ఐదేళ్లగా పోరాటం చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం మత్స్యశాఖ గుర్తించింది. గ్రామానికి చెందిన 64 మందికి సభ్యత్వం ను అందించారు. కొత్తగా సోసైటీ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మత్స్యకారులు చెరువు వద్ద సంబురాలు నిర్వహించారు. జాతర నిర్వహించారు. ఆటా, పాటలతో సందడి చేశారు. మహిళలు బోనాలు ఎత్తుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సోసైటీ ప్రతినిధులు మాట్లాడారు…మత్స్యకారులను ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సోసైటీ ని ఏర్పాటు చేసి తమకు సహకరించిన మత్స్యశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోసైటీ ప్రతినిధులు తోట వీరభద్రయ్య, శీలం వెంకటేశ్వర్లు, శీలం వెంకటనర్సయ్య, కోటేశ్వరరావు, బొమ్మకంటి చలమయ్య, చిన్నా, శీలం శ్రీనివాసరావు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Latest