Mahaa Daily Exclusive

  గాంధారి ఖిల్లా చెరువుకు పర్యవేక్షించిన కలెక్టర్ ..!

Share

మందమర్రి, మహా : ఇటీవల మందమర్రి మండలంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గాంధారి ఖిల్లా చెరువుకు గండి పడిన విషయం విధితమే. అయితే గండి పడిన ప్రదేశాన్ని గురువారం మందమర్రి తాసిల్దార్ సతీష్ కుమార్, నీటిపారుదల శాఖ డి ఈ శారద లతో కలిసి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఏర్పడే వరద పరిస్థితులపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెరువుకు పడిన గండి కారణంగా పోతున్న నీటి వలన ఎలాంటి ప్రమాదాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest