Mahaa Daily Exclusive

  డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

Share

మంచిర్యాల, మహా : కిష్టంపేట డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం, కిష్టంపేటలో నిర్మిస్తున్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. చెన్నూర్ మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల (ఇ/మీ) పరిధిలో జరుగుతున్న నిర్మాణం పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో కలిసి చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. అమృత్ 2.0 పథకం క్రింద చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. అమృత్ 2.0 పథకంలో నీటి ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి సరిపడా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest