Mahaa Daily Exclusive

  ప్రేమ జంట ఆత్మహత్య…!

Share

కర్ణాటకలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కోలార్ జిల్లా మలూరు తాలూకాలోని బ్యాటరాయనహళ్లిలో గురువారం ఈ ఘటన జరిగింది. శెట్టహళ్లి గ్రామానికి చెందిన సతీష్ (18), పనమకనహళ్లికి చెందిన శ్వేత (17) ప్రేమలో ఉన్నారు. వేర్వేరు కులాలు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని వారు భావించారు. ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకుని రైలు ముందు దూకి చనిపోయారు. రైలు ఢీకొట్టడంతో వారి మృతదేహాలు ముక్కలుముక్కలు అయ్యాయి.

Latest