Mahaa Daily Exclusive

  తగ్గిన బంగారం ధర..వెండి ఢమాల్

Share

  • ఒక్క రోజులోనే రూ.10వేలు
  • తగ్గిన బంగారం ధర
  • వెండి ఢమాల్.. భారీ పతనం

హైదరాబాద్, మహా
దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. బుధవారం ఒక్కరోజే రూ.10వేలు మేర తగ్గింది. 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,800కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,483కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,58,000కు చేరుకుంది. ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు క్రమంగా తగ్గుతూ వస్తోంది. వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్‌ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ప్రస్తుతం గోల్డ్​ రేటు తగ్గడానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధరలు 60 శాతానికి పెరిగి గరిష్ఠ స్థాయికి చేరింది. త్వరలోనే ఔన్స్ బంగారం ధర ఏకంగా 5,000 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని భావించారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే మంగళవారం లాభాల స్వీకరణతో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగి, ధరలు 6 శాతం వరకు పడిపోయాయి. బుధవారం ఆసియా మార్కెట్లలో కూడా ఈ పతనం కొనసాగింది. ఒక దశలో బంగారం ఔన్సు ధర 4,000 డాలర్ల వరకు తగ్గింది. వెండి కూడా అదే దారిలో నష్టపోయింది. దీని ప్రభావం బంగారం ఉత్పత్తిదారుల షేర్లపై తీవ్రంగా కనిపించింది. వెండి దారుణంగా పతనమైంది. ఒక దశలో కేజీ 2.03లక్షలకు వెళ్ళిన వెండి ఈ వారంలోనే 40వేల రూపాయలు తగ్గిపోయింది

Latest