- నేడే టెండర్లు!
- హ్యామ్ రోడ్డు పనుల్లో కీలక ముందడుగు
- రూ.10,547.38 కోట్ల వ్యయంతో 32 ప్యాకేజీల్లో పనులు
- దేశానికి రోల్ మోడల్‌గా రోడ్లను నిలుపాలన్నదే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, మహా: నేడు హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలువనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 5566.15 కిలోమీటర్ల రోడ్లను మొదటి విడత హ్యామ్ పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఈ రోడ్లకు రూ.10,547.38 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 32 ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నామని అన్నారు. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్ర రోడ్లను నిలుపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. వాయిదా పడుతూ వస్తున్న హ్మామ్ రోడ్ల జాబితా తుది దశకు చేరింది. మొదటి సారిగా హ్యామ్ విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణాలు సర్కార్ పచ్చ జెండా ఊపింది. మొదటి విడతలో 32 ప్యాకేజీల కింద రాష్ట్రవ్యాప్తంగా 5,566.15 కిలోమీటర్ల రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా..
బుధవారం సీఎస్ రామకృష్ణారావు హ్యామ్ విధానంలో చేపట్టనున్న 32 ప్యాకేజీల్లోని 5,566.15 కిలోమీటర్ల రహదారులకు రూ. 10,547.38 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. హ్యామ్ రోడ్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలువాలని రోడ్డు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని 400 రోడ్లను పునరుద్ధరించనున్నారు. హ్యామ్‌లో సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. డబుల్ లేన్ రోడ్డును నాలుగు వరుసగా రోడ్డుగా మార్చనున్నారు. జున్ లో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో మొదటి విడతలో దాదాపు రూ.6478.33 కోట్లతో, 17 ప్యాకేజీల కింద 373 రోడ్లను నిర్మించేందుకు ఆమోదించింది. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 5190.25 కిమీటర్ల పొడువు రహదారులు నిర్మించేందుకు నిర్ణయించారు








