Mahaa Daily Exclusive

  రూ. 11,399.33కోట్లతో రోడ్ల పనులు… రాష్ట్రంలో 419 రోడ్లకు మహర్దశ….

Share

హైదరాబాద్, మహా: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు హైబ్రిడ్ అన్యుటీ మోడ్‌ (హ్యామ్) ద్వారా చేపట్టే రోడ్డుల నిర్మాణం, విస్తరణకు సంబంధించి ప్రభుత్వం సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ అండ్ బీ శాఖ ఫేజ్-1 పరిధిలో మొత్తం 419 రోడ్ల పనులను 32 ప్యాకేజీల్లో రూ.11,399.33 కోట్ల వ్యయంతో ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ప్రకటించిన హ్యామ్ ప్రతిపాదనల్లో మార్పులు చేస్తూ నూతన ప్రతిపదానలను ఆమోదించారు. ఇందులో కొత్తగా 30 రోడ్ల పనులకు ఆమోదం తెలిపారు. వీటి అంచనా వ్యయం సుమారు రూ.850.73 కోట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరైన 7 పనులను విస్తరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆమోదించిన కొన్ని రోడ్లకు కేవలం వైడెనింగ్ కూడా చేయాలనే నూతన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. వీటి వ్యయం రూ.299.20 కోట్లు కానుంది. కాగా గతంలో ప్రతిపాదించిన 11 రోడ్ల పనులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ముందు ఆమోదించిన 11 పనులను వివిధ కారణాల వల్ల ప్రభుత్వం రద్దు చేసింది. వీటి మొత్తం పొడవు 101.38 కిమీ, అంచనా వ్యయం రూ.132.34 కోట్లు. కాగా సవరించిన ప్రణాళిక ప్రకారం మొత్తం రోడ్ల సంఖ్య 419గా మారగా… మొత్తం పొడవు: 5824.27 కి.మీ. అంచనా వేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ రోడ్ల కనెక్టివిటీ, రోడ్ల నాణ్యత మెరుగుపరచడంపైనే ప్రధాన దృష్టి పెట్టనున్నామని ప్రభుత్వం తెలిపింది.

Latest