- గ్లోబల్ సమ్మిట్లో పాల్గొననున్న డెలిగేట్స్
- పొరపాట్లు జరగవద్దు జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
- సంబంధిత అధికారులకు ఆదేశాలు
- సమ్మిట్ కార్యక్రమాల పరిశీలన
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా.
కందుకూర్ మండలం వైల్కుంట తాండలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం రంగారెడ్డి జిల్లా, కందుకూర్ మండలం, వైల్కుంటతాండలో డిసెంబర్ 8, 9వ తేదీలలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి దేశాల నుండి డెలిగేట్స్ వస్తున్న సందర్బంగా విమానాశ్రయం నుండి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతం వరకు రోడ్లు పరిశుభ్రంగా ఉండాలని, గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతంలో పారిశుద్ద్యం చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లుకు తావ్వివకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ విధులని బాధ్యతో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రోడ్లపై ఎక్కడ ఎలాంటి చెత్త లేకుండా చూడాలని, గుంతలు లేకుండా, నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, కందుకూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఆర్&బి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, నేషనల్ హైవే అధికారులు, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17







