ఆర్ఆర్@9
సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్
మెస్సీ టీమ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధం
హైదరాబాద్, మహా: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, లియోనెల్ మెస్సీ టీమ్‌తో ఈ నెల 13న జరగబోయే ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. తన క్రీడాస్ఫూర్తిని చాటుకుంటూ, ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యమంత్రి తన బిజీ షెడ్యూల్ నుంచీ కొంత సమయాన్ని కేటాయించి, యువ క్రీడాకారులతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనడం రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది.
‘ఆర్ఆర్-9’ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన ప్రతిభావంతులైన విద్యార్థుల జట్టుకు నాయకత్వం వహిస్తారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి మరింత ఊతం ఇవ్వాలని, యువతను ఫుట్‌బాల్ వైపు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అరుదైన మ్యాచ్‌ను వీక్షించడానికి క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







