Mahaa Daily Exclusive

  ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ Vs రేవంత్ సర్కారీ స్టూడెంట్స్ టీమ్: ప్రపంచ దృష్టి హైదరాబాద్‌పై!

Share

  • ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ x రేవంత్ సర్కారీ స్టూడెంట్స్ టీమ్
  • ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఎగ్జిబిషన్ మ్యాచ్
  • భారత ఫుట్ బాల్ అభిమానులంతా హైదరాబాద్ కు
  • డిసెంబర్ 13న ఆసక్తికర మ్యాచ్
  • హైదరాబాద్ బ్రాండ్.. ఫుట్ బాల్ కు పునరుజ్జీవ
  • రేవంత్ వ్యూహం పై దేశవ్యాప్తంగా ప్రశంసలు

(హైదరాబాద్ – మహా)
భారత ఫుట్ బాల్ కు హైదరాబాద్ ను అడ్డాగా మార్చే వ్యూహం.. ఏకంగా మెస్సీతోనే తెలంగాణ సర్కారు స్టూడెంట్స్ ను వెంటబెట్టుకుని కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి తలపడే స్ఫూర్తిదాయక సన్నివేశం.. మొత్తంగా హైదరాబాద్ ఫుట్ బాల్ రంగానికి పునరుజ్జీవం లాంటిది. సీఎం రేవంత్ అదిరే వ్యూహంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓవైపు గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచ దిగ్గజాలను రప్పించే వ్యూహాలు, సన్నాహాలు, సమీక్షల నడుమ.. ఆశ్చర్యపరుస్తూ అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సీఎం పాల్గొంటారు. ఈ మ్యాచ్‌లో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ పాల్గొననున్నారు. మెస్సీతో కలిసి సీఎం ఫుట్‌బాల్ ఆడనున్నారు. దీనిలో భాగంగా ఎంసీహెచ్ఆర్‌డీలో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. సుమారు గంటపాటు ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. స్వయంగా ఫుట్ బాల్ ఆటగాడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం చిక్కినప్పుడల్లా గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పరుగులు తీస్తూ గోల్స్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత ఏడాది మే 12న హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి ఫుట్ బాల్ ఆడారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూ లేకుండానే సీఎం ఫుట్ బాల్ ఆడారు. ఇపుడు గోట్ ఇండియా టూర్ 2025 లో భాగంగా స్టార్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న మెస్సీకి ప్రభుత్వం ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 1 న ప్రారంభమైన ప్రజాపాలన ఉత్సవాలు.. డిసెంబర్ 8న గ్లోబల్ సమ్మిట్ నాటికి పతాకస్థాయికి చేరి, డిసెంబర్ 13న మెస్సీ.. సీఎం ఫుట్ బాల్ మ్యాచ్ తో హైఓల్టేజ్ తో ముగుస్తాయి.

ప్రభుత్వ స్కూల్ విద్యార్ధులకు కెప్టెన్ గా..

ప్రపంచ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్.. లియోనెల్ మెస్సీ ఇండియా టూర్‌కు సిద్ధమయ్యారు. ఈ టూర్‌లో భాగంగా డిసెంబర్ 13న ఆయన హైదరాబాద్‌ రానున్నారు. అయితే హైదరాబాద్ రానున్న మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నారు. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో మెస్సీతో కలిసి సీఎం రేవంత్ పోటీ పడనున్నారు. మెస్సీ టీంతో తలపడే జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ కెప్టెన్సీ వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్‌కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్లు రేవంత్ టీంలో ఆడనున్నట్లు సమాచారం. ఆర్‌ఆర్ 9 జెర్సీతో సీఎం బరిలోకి దిగనున్నారు. ఫుట్‌బాల్ అంటే సీఎంకు ఎంతో ఇష్టం. ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌ కోసం సీఎం రేవంత్ ఫుట్‌‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే ఈ ఫోటోలను కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

Latest