- జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐక్యపోరాటం
- ధర్నా విజయవంతం చేయండి
- టీజేఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా
మహా
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు,తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సలహాదారు ఉప్పల లక్ష్మణ్ సూచన మేరకు టిజేఏ రాష్ట్ర అధ్యక్షుడు కదిరి వెంకటరమణారావు, రాష్ట్ర కార్యదర్శి ఘోరీ,ఎన్ యూ జే ఐ ఉపాధ్యక్షుడు రాజేంద్రనాథ్ ఆదేశాల మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సమాచార శాఖ కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ చేయనున్న ధర్నాకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టి జే ఏ) కూడా పాల్గొని ధర్నాను విజయవంతం చేయనున్నామని టీజేఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడేషన్ ,హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్, బస్ పాసులు,ట్రైన్ పాసులు,ఇండ్ల స్థలాలు, ఇండ్లు తదితర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం లభించాలని టి యూ బ్ల్యూ జే చేయతలపెట్టిన ధర్నాకు అన్ని సంఘాల నాయకులు పాల్గొని జర్నలిస్టుల సంక్షేమం కోసం అన్ని యూనియన్ లు కలిసి పోరాటాలు చేసినప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు. సూర్యాపేట జిల్లా లోని అన్ని మండలాల టి. జే. ఏ.అధ్యక్షులు కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.






