మేడారం జాతరలో అత్యంత కీలకమైన సారలమ్మ అమ్మవారి రాక సందర్భంగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. కన్నెపల్లి ఆలయం నుంచి పూజారులు అమ్మవారిని పసుపు, కుంకుమ భరిణ రూపంలో గద్దెల వద్దకు తీసుకువస్తుండగా, మంత్రి సీతక్క వారితో కలిసి అడుగులు వేశారు. ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి, డోలు దరువులకు అనుగుణంగా ఆమె చేసిన నృత్యం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనను ఈ స్థాయికి చేర్చిన వనదేవతలపై ఉన్న భక్తిని ఆమె ఈ విధంగా చాటుకున్నారు.
Post Views: 14







