Mahaa Daily Exclusive

  పట్నం పురపోరులో రంగులరాట్నం.!

Share

  • పట్నం పురపోరులో రంగులరాట్నం.!
  • రంగు మారుతుంది! జండా వీడుతున్నరు!
    ఆశావాహులకు అవకాశం వ్యవహారం.?
    ప్రధాన పార్టీలలో నెలకొన్న పరిస్థితులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా (ఇబ్రహీంపట్నం):

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో గత నెల 28 నుంచి 30 వరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శనివారం నామినేషన్ పత్రాల పరిశీలన జరిగింది. నేడు రేపు విత్ డ్రాల ప్రక్రియ ఉండడంతో ఆశావాహుల్లో ప్రత్యేక వాతావరణం నెలకొంది.

రంగారెడ్డి జిల్లా…. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు. పురపోరులో ఆశావాహులదే అవకాశం అన్నట్టుగా వ్యవహారం నడుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. రంగు మారుతుంది జెండా పెడుతున్నారు అవకాశం కోసం చూస్తూ వ్యవహారంతో జండా పడుతూ వెళ్తున్న తీరు ప్రజలకు అర్థం కాని గందరగోళం నెలకొంది. పార్టీ టికెట్ ఆశించి తీరా దగ్గరికి వచ్చేసరికి బీఫామ్ వచ్చే పరిస్థితి లేదని తెలుసుకున్న నాయకులు కొందరు రంగు మారుస్తూ వేరొక పార్టీ జెండా ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని కొందరు నాయకులు చెప్తున్న మాట. నేడు, రేపు విత్ డ్రాలు ఉండడంతో మరికొంతమంది వేచి చూస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి రేపటితో మరిన్ని పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ప్రధాన పార్టీలల్లో కనిపిస్తున్నాయి. ఎవరు ఎటు వెళ్తారు ఏ పార్టీ వైపు తమ క్యాడర్ను తీసుకెళ్తారు అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ప్రధాన పార్టీల నాయకులు, క్యాడర్ను వదిలేస్తారా లేదంటే బుజ్జగింపులతో సమస్యను పరిష్కరిస్తారా, అనేది వేచి చూడాల్సి ఉంది. మరికొందరైతే గత పది రోజుల నుంచి జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి ఎవరి పరిస్థితి ఏంటి అనేది ఈ రెండు రోజులలో తేలనుంది.