Mahaa Daily Exclusive

  మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి…

Share

  • మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి
  • కారేపల్లి జిన్నింగ్ మిల్లులో స్ధానిక రైతులకు అవకాశం ఇవ్వాలి – రైతు సంఘం

కారేపల్లి, మహా : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన మొక్కజొన్న బస్తాల దిగుమతిలో తీవ్ర జాప్యం జరుగుతుందని దానిని నివారించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ లు డిమాండ్ చేశారు. మంగళవారం కారేపల్లిలోని జిన్నింగ్ మిల్లులో మొక్కజొన్న బస్తాల స్టాక్ పాయింట్ ను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు తోపాటు దిగుమతి పాయింట్ లో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. రైతులు, వాహనాల డ్రైవర్లతో రైతు సంఘం నేతలు మాట్లాడారు. సోసైటీ అధికారులతో చర్చించారు. రైతుల ఇబ్బందులు కలగకుండా చూడాలని స్ధానిక అధికారులను కోరారు. ఈసందర్బంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కారేపల్లి జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న బస్తాల స్టాక్ పాయింట్‌లో స్థానిక రైతుల ట్రాక్టర్లు, లారీలు కి కూడా అవకాశం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం, అవగాహన లేకపోవడంతో మొక్కజొన్న బస్తాలు దిగుమతి కేంద్రాల్లో రైతులు, లారీ, ట్రాక్టర్లు డ్రైవర్లు రోజుల తరబడి తీవ్ర ఇక్కట్లు గురవుతున్నారన్నారు. దిగుమతి పాయింట్ వద్ద కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేదన్నారు. ఏక కాలంలో ఎక్కువ పాయింట్ల లో దిగుమతిలు చేయాలని సూచించారు. ఒక్క పాయింట్ పూర్తి గా నిండిన తర్వాత మరో పాయింట్ దిగుమతి కి అవకాశం ఇవ్వడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్క్పు£న్న కొనుగోళ్లపై స్ధానిక ఎమ్మెల్యే ప్రతి రోజు సమీక్షించాలని కోరారు. ఈ సందర్బంగా జిన్నింగ్ మిల్లుకు వచ్చిన మార్క్‌ఫెడ్ డీయం కు సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల అధ్యక్షులు ముండ్ల ఏకాంబరం, కార్యదర్శి వజ్జా రామారావు, సోసైటీ డైరక్టర్ అడ్డగోడ ఐలయ్య, రైతులు పాల్గొన్నారు.