Mahaa Daily Exclusive

  రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.

Share

 

కారేపల్లి, మహా : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గుంపెళ్ళగూడెం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. గుంపెళ్ళగూడెంకు చెందిన సీతారాం(45) తన మోటర్ సైకిల్‌పై ఇల్లందు వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద మోటర్ సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడి పోయాడు దీంతో తీవ్రగాయాలైన సీతారాం అక్కడి అక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.