Mahaa Daily Exclusive

  ఒమన్ తీరంలో తీవ్ర అలజడి.

Share

  • ఒమన్ తీరంలో తీవ్ర అలజడి
  • ఇండియన్స్ టార్గెట్‌గా అమెరికా దాడులు
  • భారతీయులున్న మరో నౌకపై మిస్సైళ్లు

ఇంటర్నెట్, మహా : అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భారతీయుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఇప్పటికే భారతీయులున్న ఓ నౌకపై అమెరికా మిసైళ్ల వర్షం కురిపించడంతో, అందులోని ముగ్గురు ఇండియన్ నావికులు మృతిచెందారు. ఆ ఘటన మరువక ముందే మరో వాణిజ్య నౌకపై కూడా అమెరికా సైనికులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఒమాన్‌లోని షినాస్ పోర్టు సమీపంలో భారతీయులు ఉన్న మరో నౌకపై దాడి జరిగినట్లు భారత రాయబార కార్యాలయం గురువారం వెల్లడించింది. నౌకపై జరిగిన దాడి ఘటనపై తాము నిశితంగా నిఘా ఉంచామని, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్థానిక అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నామని ఒమాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

గినియా – బిస్సావు జెండాతో ప్రయాణిస్తోన్న జలవీర్ అనే నౌకే లక్ష్యంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్‌తో ఉన్న ఈ నౌకను టార్గెట్ చేసే మిసైళ్లు వేసినట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం ప్రారంభైన తర్వాత భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి. ఇప్పటికే రెండు నౌకలపై అమెరికా దాడులు చేపట్టింది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లో భారతీయ సిబ్బంది ఉన్న సెట్టెబెల్లో నౌకపై అమెరికా బలగాలు బుధవారం దాడి చేశాయి. అందులో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా 21 మందిని రక్షించారు. ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందినట్లు కేంద్ర మంత్రి గురువారం అధికారికంగా ప్రకటించారు.

గతంలో ఇరాన్ చమురు వ్యాపారంలో పాల్గొంటున్నట్లు అనుమానించిన మారివెక్స్ అనే ఖాళీ ట్యాంకర్‌పై కూడా అమెరికా బలగాలు కాల్పులు జరిపాయి. ఆ నౌకలో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. భారతదేశానికి సంబంధించిన వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పునరుద్ధరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.