Mahaa Daily Exclusive

  చిన్న కాంట్రాక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు సఫలం…

Share

చిన్న కాంట్రాక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు సఫలం.
* ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం వాయిదా.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం వేసిన అడుగులు సత్ఫలితాలను ఇచ్చాయి. పెండింగ్ బిల్లుల సాధన కోసం ఆందోళన బాటపట్టిన చిన్న కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ కీలక సమావేశంలో కాంట్రాక్టర్ల సమస్యలపై, ప్రధానంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల అంశంపై ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం అత్యంత సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ చిన్న కాంట్రాక్టర్లకు అండగా ఉంటుందని, పెండింగ్ బిల్లుల మొత్తాన్ని దశలవారీగా విడుదల చేసి వారి ఇబ్బందులను పరిష్కరిస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భరోసాతో కాంట్రాక్టర్లలో ఆశావహ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ సానుకూల స్పందన మరియు స్పష్టమైన హామీల నేపథ్యంలో, తమ డిమాండ్ల సాధన కోసం జూన్ 18వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చిన్న కాంట్రాక్టర్ల సంఘం అధికారికంగా ప్రకటించింది.