హైదరాబాద్, మహా.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఫెడరేషన్ అనుమతి లేకుండా ఉప ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ విషయంపై జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలకు చెందిన డాన్సర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలకు నిరసనగా అసోసియేషన్‌కు చెందిన సుమారు పది మంది డాన్సర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణ, సభ్యత్వ వ్యవహారాలపై నెలకొన్న వివాదం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Post Views: 6








