Mahaa Daily Exclusive

  ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి..

Share

  • ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
  • పెన్షన్ దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టి సారించాలి
  • వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, బ్యూరో మహా ;

వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజలనుండి వినతులు స్వీకరించారు.
ఈ ప్రజావాణి కి మొత్తం 189 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెవెన్యూ శాఖకు 49, డీఆర్డీవో 12, హౌసింగ్ శాఖకు 68 రాగా
ఇతర శాఖలకు సంబంధించి దరఖాస్తులు 60 వచ్చాయాని,
వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు తక్షణమే ఎండార్స్ చేసి సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖలు అధికారులను ఆదేశించారు.
ప్రజావాణికి రెవెన్యూ హౌసింగ్ ,పెన్షన్ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని అట్టి దరఖాస్తులను పరిశీలనార్థం సంబంధిత శాఖలకు ఎండాఫ్ చేస్తూ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,జడ్పీ సీఈవో రామ్‌రెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, డిఆర్డిఓ నాగ పద్మజ, డి ఎం ఎం హెచ్ ఓ డా.ప్రకాష్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వినతులు సమర్పించారు.