- కాలేజీ వేళలో లెక్చరర్ కారు ట్రయల్…
- తప్పిన ప్రమాదం
- దెబ్బతిన్న టయోటా కంపెనీ కొత్త కారు
- కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఘటన
కారేపల్లి, మహ:విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వృత్తి లో ఉన్న వారే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కళాశాల వేళల్లో కాలేజీ గ్రౌండ్ లో కారు ట్రయల్ వేసి పెద్ద ప్రమాదం నుంచి బయట పడిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటుచేసుకుంది… టయోటా కంపెనీ వారు కొత్త కారు మేళాను కారేపల్లిలో నిర్వహించి ఆ కారును జూనియర్ కళాశాల ఆవరణలోకి తీసుకెళ్లారు. లంచ్ సమయంలో విద్యార్థులంతా రూముల్లో భోజనం చేస్తుండగా ఓ మహిళా లెక్చరర్ మరో ఇద్దరు లెక్చరర్ల ను కారులో కూర్చో బెట్టుకుని కారు ట్రయల్ రన్ కు బయలుదేరింది.. కారు తీసిన వెంటనే అదుపు చేయలేక కాలేజీ ఆవరణలో ఉన్న వో చెట్టును ఢీకొట్టింది. కారు ముందు భాగం దెబ్బతిన్నది. ఎటువంటి గాయాల పాలు కాకుండా కారులో ఉన్న ముగ్గురు బయటపడ్డారు. ఆ సమయంలో విద్యార్థులెవరూ గ్రౌండ్ లో లేకపోవడం పెద్ద ప్రమాదమే తప్పింది. కళాశాల సమయంలో గేట్ తీసి కారును లోపలకు రావడానికి ప్రిన్సిపల్ ఎలా అనుమతి ఇచ్చారనేది ప్రశ్నార్థకమైంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం కూడా చర్చనీయాంశమైంది.







