వరంగల్, క్రైమ్ మహా;
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం హర్జతండా కు చెందిన
పేరు బాదవత్ బాలమ్మ
భర్త పేరు కీర్తిశేషులు నరసింహ, వయస్సు 54 సంవత్సరాలు, కులం లంబాడి
వృత్తి వ్యవసాయం అనే వీరు బానోతు కీర్తన అనే యువతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం
అదృశ్యమైన యువతి వివరాలు
పేరు బానోతు కీర్తన, వయస్సు 18 సంవత్సరాలు, తండ్రి పేరు మోతిలాల్
కులం లంబాడి, విద్య: చదువుకుంటోంది
ఎత్తు సుమారు 5.5 అడుగులు, ఛాయ తెలుపు
అదృశ్యమైన సమయంలో ధరించిన దుస్తులు ఆకుపచ్చ రంగు టాప్, ఎరుపు రంగు ప్యాంటు
అదృశ్యమైన తేదీ: 3 8 2026
సమయం రాత్రి సుమారు 11:30 గంటలు 3 8 2026 తేదీ రాత్రి సుమారు 9:00 గంటలకు బాదవత్ బాలమ్మ తో పాటు కీర్తన ఇంట్లో నిద్రించారు. అదే రోజు రాత్రి సుమారు 11 30 గంటలకు బాలమ్మ నిద్రలేచి చూడగా కీర్తన ఇంట్లో కనిపించలేదు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల వద్ద వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.
కీర్తన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల వద్ద వెతికినప్పటికీ సమాచారం లభించకపోవడంతో గీసుగొండ పోలీసులను ఆశ్రయించారు.
కీర్తన ఆచూకీ తెలిసిన వారు లేదా ఆమెను ఎక్కడైనా గుర్తించిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. యువతి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని గీసుగొండ ఇన్స్పెక్టర్
డి విశ్వేశ్వర్ తెలిపారు.







