- యువత ప్రతిభకు మిషన్ వాక్ ప్రోత్సహం
- కొత్తతండాలో మిషన్ వాక్ స్కిల్ డెవలఫ్ మెంట్ సెంటర్ ప్రారంభం
కారేపల్లి, మహ:గ్రామీణ ప్రాంత యువత ప్రతిభకు ప్రోత్సహం అందిస్తూ వారి భవిష్యత్తు తీర్చిదిద్దటమే మిషన్ వాక్ స్కిల్ డెవలప్‌మెంట్ పని చేస్తుందని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, వైద్యుడు డాక్టర్ బాదావత్ రవి అన్నారు. సింగరేణి మండలం డాక్టర్ రవి స్వగ్రామం కొత్తతండాలో యువతకు ఉపాధి, పేదలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు మిషన్ వాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మిషన్ వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాదావత్ రవి మాట్లాడుతూ యువతకు నైపుణ్య శిక్షణ అందించి,ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం చూపాలనే సంకల్పంతో స్వంత గ్రామంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువతకు సరైన దిశానిర్దేశం చేసి నైపుణ్యాలను అందిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచే ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారన్నారు. గ్రామీణ యువతలో ప్రతిభ, ఉత్సాహం ఉన్నప్పటికీ సరైన శిక్షణ,మార్గదర్శకత్వం లేక ఆర్థిక పరిస్థితుల కారణంగా అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నర ని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాలు అత్యంత అవసరమన్నారు. గ్రామీణ యువత ఉద్యోగ, ఉపాధి కోసం పట్టణాల వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు అవకాశాలు మన దగ్గరకే రావాలంటే నైపుణ్యం ఉండాలని ఆ ఆలోచనతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. మిషన్ వాక్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ బాధితులు, దివ్యాంగులు,పేద కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. గ్రామ సేవా యాత్ర ద్వారా మిషన్ వాక్ సేవలను విస్తృత పర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు, మిషన్ వాక్ సభ్యులు ఆర్మీ సోల్జర్ బానోత్ దశరథ్, సురేష్, నరేష్, షరీఫ్, సాయి, అజయ్, పవన్, ప్రసాద్, షేర్ ఖాన్, హాజ్రా, పీకే సింగ్, నితిన్, రంగ, భద్రు, దేవా, సతీష్, రాయల శ్రీను, పవన్, ప్రసాద్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.








