Mahaa Daily Exclusive

  బర్తరఫ్ ల ఓరు’ఘొల్లు..! నాడు తాటికొండ రాజయ్య.. నేడు కొండా సురేఖ..

Share

(మహా ప్రత్యేకం)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేబినెట్ నుంచి మంత్రులను తొలగించిన ఘటనలు రాష్ట్రంలో సంచలనంగా మారుతున్నాయి. నాడు కేసీఆర్ కు ఎదురైన సవాళ్ళే నేడు రేవంత్ కు ఎదురు కాగా, సంచలన ప్రతిస్పందనతో వాటిని ఎదెర్కొంటున్నారు. ఇప్పటివరకు అత్యంత అవమానకర రీతిలో జరిగిన బర్తరఫ్‌ల్లో తాటికొండ రాజయ్య, కొండా సురేఖ ఇద్దరి పేర్లు ప్రముఖంగా నిలుస్తున్నాయి. ఇద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలే కావటంతో ఓరుగల్లులో చర్చ జరుగుతుంది. వరంగల్ జిల్లా నేతలపైనే ఎందుకు లాంటి బర్తరఫ్ లు అని చర్చ జరుగుతోంది. 2014లో తెలంగాణ అవతరణతో కేసీఆర్ ప్రభుత్వంలో తొలి డిప్యూటీ సీఎంగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తాటికొండ రాజయ్యను 2015 జనవరి 25న అకస్మాత్తుగా బర్తరఫ్ చేశారు. స్వైన్ ఫ్లూ నిర్వహణలో లోపాలు, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు కారణంగా చూపించినా, ఆ తొలగింపు విధానం అత్యంత అవమానకరంగా జరిగిందని చర్చ సాగింది. వరంగల్ ప్రాంతం నుంచి ఇచ్చిన డిప్యూటీ సీఎంను ఒక్కసారిగా పక్కన పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమైంది. ఇప్పుడు అదే వరంగల్ కు చెందిన నేత కొండా సురేఖపై ఇదే తరహా చర్య జరిగింది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆమెను బర్తరఫ్ చేశారు. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలు, పార్టీలో అంతర్గత వివాదాలు కారణంగా చూపించడం ఆమె ఆ వ్యాఖ్యలను ఖండించకపోగా, కొనసాగింపు కామెంట్స్ చేయడంతో హైకమాండ్ సీరియస్ అయింది.

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మంత్రి బర్తరఫ్‌ల్లో తాటికొండ రాజయ్య తర్వాత కొండా సురేఖది రెండో అత్యంత అవమానకర కేసుగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఇద్దరూ వరంగల్ ప్రాంతీయ నాయకులు కావడం, ఇద్దరి తొలగింపు కూడా అకస్మాత్తుగా, వివాదాస్పదంగా జరగడం గమనార్హం. ఒకరు డిప్యూటీ సీఎం స్థాయి నుంచి, మరొకరు మంత్రి స్థాయి నుంచి ఇలా తప్పుకోవాల్సి రావడం వరంగల్ రాజకీయాలపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణంగా మారింది. 2014 తొలిటర్మ్ లో రాజయ్యను పదవి నుండి తొలగించినా. తర్వాత టర్మ్ లో కూడా కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. కొండాసురేఖ పై వేటును కాంగ్రెస్ కార్యకర్తలు సమర్ధిస్తుండగా, కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా రెండు టర్మ్ లు పాలిస్తారని చెప్పుకుంటున్నారు.
…..

Latest