- సర్పంచ్‌కు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భరోసా
- వీడియో కాల్‌లో ఆరోగ్య వివరాలు తెలుసుకొన్న ఎమ్మెల్యే…
- సర్పంచ్‌ను పరామర్శించిన సింగరేణి మండల సర్పంచులు
కారేపల్లి, మహా :రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్‌ను సింగరేణి మండల సర్పంచులు సోమవారం పరామర్శించారు.గాదెపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్, సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచులు ఆమె నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ వీడియో కాల్ ద్వారా సుజాత సంతోష్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరలోనే స్వయంగా వచ్చి కలుస్తానని భరోసా ఇచ్చారు. సాటి సర్పంచులు అందరూ సర్పంచ్‌కు అండగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో సూర్య తండా సర్పంచ్, సింగరేణి మండల సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు బానోత్ రాందాస్ నాయక్, ఉపాధ్యక్షుడు మోతి వీరస్వామి, పేరుపల్లి సర్పంచ్ బానోత్ పద్మ వీరభద్రు, గేట్ కారేపల్లి సర్పంచ్ పూసం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.







