Mahaa Daily Exclusive

  జగన్ సాంగ్ వైరల్….

Share

  • జగన్ సాంగ్ వైరల్
  • నెట్టింట మోతమోగుతున్న గన్ పెడతవ బై పెట్టు సాంగ్
  • ఫుల్ సాంగ్ రిలీజ్.. నెట్టింట షేక్

(మహా నెట్ వర్క్ )

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి “గన్ పెడతావా బై, పెట్టు..” గోళీ కొడతావా బై, కొట్టు… అనే కొత్త పాట సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఎన్నికలకు ముందు కూడా జగన్ కు సంబంధించి నల్లగొండ గద్దర్ పాడిన పాట వైరల్ కాగా, ఇపుడు నల్లగొండ గద్దర్ పాడిన పాటకు వీడియో.. లిరిక్ లు కలిపి రిలీజ్ చేసిన సాంగ్ నెట్టింట మోతమోగుతోంది. వైసీపీ కార్యకర్తలు, అభిమానులకు రోమాలు నిక్కబొడిచేలా సాంగ్ ఉంది.

ఓటు రాజకీయం నాకు రాదు తమ్మి.

ఆకలి అన్న కడుపు నింపినాము చాలు తమ్మి.

కుల రాజికీయం చేయలేదు తమ్మి.

కస్టమన్నా కళ్ళు తుడిచినాము.

నెగ్గుతాం ఓ నాడు.

తగ్గుతం ఓ నాడు.

తగ్గిన నెగ్గాలంటారా.

అంటూ సాగే పాటను.. కార్యకర్తలు బిట్లు బిట్లుగా కట్ చేసి.. తమకు నచ్చిన లక్షణాలను, పదాలను, వాక్యాలను షేర్ చేస్తున్నారు. ఇటు ట్విట్టర్ లో, అటు ఫేస్ బుక్ లో ఎటుచూసినా దిల్ సే బోలో జగన్ సాంగ్ ఇట్టే ఆకట్టుకుంటోంది. మళ్ళీ మళ్ళీ వినిపించేలా సాంగ్ ను చెక్కినట్లు కనబడుతోందని, ఎన్నికల దాకా ఇది చాలు.. అంటూ అభిమానులు హైలోకి వెళ్ళిపోతున్నారు.

ఆ మనిషి వేరు ఆ మనసు వేరు!

పేదింట వెలిగినాడురా రాజన్న తీరు!

ఆ దమ్ము వేరు ఆ కథ వేరు!

నీతిగా తనకెదురుగెల్లి గెలవలేరు!

పుట్టేది ఓ నాడే సచ్చేది ఓ నాడే!

పుట్టిన గడ్డ రుణం తీర్చ జెండానేతాడే!

ఒక్కడే ఒక్కడు దమ్ము!

గుండెల దమ్ముంటే ఆపరా నన్ను!

అంటూ సాగిన లిరిక్స్ వైసీపీ శ్రేణులకు పండుగగా మారాయి. స్థానిక ఎన్నికల్లో అంచనాలకు మించి పోరాడిన వైసీపీ ఇపుడు తాజా సాంగ్, తాజా రాజకీయ పరిణామాలతో ఉత్సాహంగా ఉన్నాయి.
……..