చైనా మాంజా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ మాంజా కారణంగా పలు చోట్ల మరణాలు సంభవించగా మరికొన్ని చోట్ల చాలామంది గాయాల పాలయ్యారు. తాజాగా నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీస్ గాయపడ్డారు. బాధితుడిని లంగర్ హౌస్ పీఎస్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శివరాజ్ గా గుర్తించారు. ఇక సంగారెడ్డి జిల్లా కర్దనూరు రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Post Views: 37








