Mahaa Daily Exclusive

  వైసీపీకి ఏపీ హోంమంత్రి వార్నింగ్…!

Share

శ్రీకాకుళం జిల్లాలో ఓ బాలికను ఒక వ్యక్తి కొడితే.. అది గ్యాంగ్ రేప్ అని YCP నేతలు అబద్ధపు ప్రచారం చేశారన్నారని AP హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆ బాలిక ఇష్యూ‌కు సంబంధించి నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్నామన్నారు. బాధిత కుటుంబం అత్యాచారం జరగలేదని ఫిర్యాదు ఇచ్చినా కావాలనే YCP నేతలు నీచ రాజకీయం చేస్తున్నారన్నారు. బాధిత మహిళలను అవమానపరిచేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హోంమంత్రి హెచ్చరించారు.