: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. 27 ఏళ్ల తర్వాత అవినీతి సామ్రాజ్యం హస్తినలో కూలిందని అన్నారు. మార్పు కోసమే ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించారని ఉద్ఘాటించారు. తాను ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని తెలిపారు. దేశ రాజధానిలో మంచినీళ్లు దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో తాను ఉండొచ్చని, అది హై కమండ్ నిర్ణయమని చెప్పారు. రేవంత్ రెడ్డికి లోకల్ బాడి ఎన్నికల భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు అంటున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం ఎదురు అవుతోందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.
Post Views: 177








