తండేల్’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య, సమంతతో విడాకుల గురించి తొలిసారి స్పందించారు. వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాగచైతన్య, సమంత విడాకులు అనేవి ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వీరి ప్రేమ, పెళ్లి గురించి ఎంతమంది ప్రేక్షకులు మాట్లాడుకున్నారో.. అంతకంటే ఎక్కువమంది వారి విడాకుల గురించి మాట్లాడుకున్నారు. విడాకుల గురించి, రెండో పెళ్లి గురించి నాగచైతన్య ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటిసారి.
వెయ్యి సార్లు ఆలోచించాం..
‘‘నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చానో అందరికీ తెలుసు. పెద్ద ఫ్యామిలీ అయినా నేనూ ఒక విడిపోయిన కుటుంబం నుంచి వాడినే. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి సందర్భంలో నిర్ణయం తీసుకోవాలంటే 1000 సార్లు ఆలోచించాలి. సమంతతో విడిపోవాలనుకున్నట్లు ఇద్దరం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. అదే ప్రకటించాం. ‘వేర్వేరు మార్గాల్లో వెళ్లాలనుకుంటున్నాం. దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు’ అని రిక్వెస్ట్ చేశాం. మేం ఇచ్చిన మెసేజ్ మీడియాకు, నెటిజన్లరు ఓ హెడ్‌లైన్ అయిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న పెయిన్ మరచిపోయి దానిని వినోదంగా తీసుకున్నారు. మేం ఏమీ ఓవర్ నైట్ నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు వెయ్యి సార్లు ఆలోచించాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వారి చూసుకున్నాం. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు. కానీ వచ్చింది. ఏం జరిగిన దానికంటూ ఓ కారణం ఉంటుంది. గత మూడేళ్లగా ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారీ సమాధానం చెబుతూనే ఉన్నా. కానీ ఎక్కడా ఫుల్‌స్టాప్ పడటం లేదు. ఎన్నిసార్లు మాట్లాడినా, వివరణ ఇచ్చినా రాసేవాళ్లు రాసుకుంటేనే ఉంటారు. ఎవరైతే ఈ ట్రోలింగ్ చేస్తూ, కథనాలు సృష్టిస్తున్నారో వారు నా గురించి ఆలోచించడం కాకుండా వారి లైఫ్ మీద టైమ్ ఇన్వెస్ట్ చేస్తే బావుంటుందేమో’’ అని అన్నారు చైతన్య. ప్రస్తుతం నాకంటూ ఓ లైఫ్ ఉంది. ఎంతో ఆనందంగా ఉంది’’ అని చైతూ అన్నారు.








