ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది అద్భుతమైన, చరిత్రాత్మకమైన తీర్పు అని కొనియాడారు. ఢిల్లీ ప్రజలకు అద్భుతమైన సేవ అందిస్తామన్నారు. అభివృద్ధి, సుపరిపాలన గెలుస్తుందన్నారు. ఈ అద్భుతమైన తీర్పు అందించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ ఆశీర్వాదం పొందడం చాలా గౌరవంగా ఉందన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఏ అవకాశాన్ని వదులుకోబోమన్నారు. ఈ విజయాన్ని అందించడానికి కృషి చేసిన ప్రతీ బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
Post Views: 133








