రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1, ఆపై స్థాయి అధికారులందరూ ఏప్రిల్ లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ”రెండు, మూడురోజులు గ్రామాల్లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. పట్టణాల కంటే మెరుగ్గా ఉన్నాయి. వాతావరణం, మౌలికసదుపాయాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 5జోన్లు ఏర్పాటు చేస్తాం.. అక్కడికి వెళ్లి కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రధాన సమస్యల్ని పర్యవేక్షిస్తే చాలావరకు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి’ అని వెల్లడించారు.
Post Views: 73








