కోనసీమ జిల్లాలో మరిన్ని ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను కలిసి వినతిపత్రం ఇచ్చామని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర శాఫ్ ఛైర్మన్ రవి నాయుడుతో కలిసి మంత్రిని కలిశామన్నారు. క్రీడల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరామన్నారు. దీనిపై గతంలో ఇచ్చిన లేఖకు సంబంధించిన పురోగతిపై వివరాలను తెలుసుకున్నామని చెప్పారు.
Post Views: 132








