మహా :
బిఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ చేరికలు జరిగాయి. బంజారాహిల్స్ డివిజన్ కు చెందిన వందమందికి పైగా యువకులు బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మన్నె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో ప్రజలను మోసగించిందన్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడానికి, అబద్దాల ముఖ్యమంత్రి రేవంత్ ను సాగనంపడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ లో నెంబర్ వన్ గా చేద్దామని, మీకు ఏ ఇబ్బంది ఉన్నా.. తాను అండగా ఉంటానన్నారు. కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ గా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలుచేశారన్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా.. నాగేందర్ ను చిత్తుచిత్తుగా ఓడిద్దామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ విప్లవ్ కుమార్, కార్పోరేటర్ మన్నె కవితారెడ్డి, యువ నాయకులు పాల్గొన్నారు.







